గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర గ్రామాల్లో పథకం ప్రకారమే దుండగులు పంట పొలాలను,వ్యవసాయ పరికరాలను దగ్దం చేసినట్లు కనబడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
ప్రత్యేకించి భూసమీకరణను వ్యతిరేకించే గ్రామాల్లోనే ఒకే తరహాలో ఇవి జరగడం
పలు అనుమానాలకు తావిస్తున్నదని ఆయన చెప్పారు. భూసమీకరణను వ్యతిరేకించే
రైతులను భయబ్రాంతలుకు గురిచేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు
తెలుస్తోందన్నారు., దీనిపై వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా
శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం
చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆరు గ్రామాల్లోని 13 మంది రైతుల పంట పొలాకు నిప్పంటించిబీభత్సం
సృష్టించారు. బోర్లు, సూక్ష్మ సేద్యానికి ఉపయోగించే మోటార్లను ధ్వంసం
చేశారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ విధ్వంస కాండ కొన్ని గంటల పాటు
కొనసాగాయింది. పంటలను, గుడిసెలను మంటల పాలు చేయడం, పరికరాలను ధ్వంసం
చేయడంతో 50 లక్షల రూపా యల మేర నష్టం జరిగిఉంటుందని రైతు ప్రతి నిధులు అంచనా
వేస్తున్నారు.ఈ సంఘటనతో 11 గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసులను ప్రభుత్వం మొహరించింది. ఆ
గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇంటిలిజెన్స్, క్రైం పార్టీ, స్పెషల్ బ్రాంచీ,
ఏఆర్ పోలీసులతో గ్రామాలన్నీ నిండిపోయాయి.పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడిపోతున్నారు.. సంఘటనను పరిశీలిచేందుకు ఉండవల్లి, పెనుమాక పొలాలలకు చేరుకున్న మంత్రిని
రైతులు నిలదీశారు. దీనికి కారణం ఎవరో తేల్చాలని పట్టుబట్టారు. తాము పొలాలు
తగుల బెట్టామని మీరు ఎలా చెబుతారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో మంత్రి
అక్కడ నుంచి వెళ్లిపోబోతుండగా మరలా అడ్డుకున్నారు. తాము భూములివ్వబోమంటూ
నినాదాలు చేశారు.
No comments:
Post a Comment