ఎం. బి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడలో 'రాజధాని నిర్మాణం పాలన కోసమా- ప్రతిష్ట కోసమా' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆంధ్రాలో రాజధానికి పెద్దఎత్తున
భూములు సమీకరించి అన్ని వసతులూ అక్కడే ఏర్పాటు చేస్తారనే ప్రచారం ద్వారా
పెట్టుబడులన్నింటిని పాలకులు ఒకచోట కేంద్రీకరించే పనిచేస్తున్నారని రాఘవులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇదే పద్ధతి అనుసరించడం వల్ల ప్రజల మధ్య అసమానతలు పెరిగి
ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయని చెప్పారు.. ప్రజా రాజధాని అంటే అక్కడున్న
ప్రజలు లాభపడేవిధంగా ఉండాలేగాని, వారిని తరిమేసి మరొకరికి అవకాశం కల్పించే
విధంగా ఉండకూదన్నారు.వనరులను కార్పొరేట్ శక్తులకు బదిలీ చేయడంతోపాటు అభివృద్ధి కేంద్రీకరణ జరిగేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్ష వైఖరి అవలంభిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సిఆర్‌డిఏ చట్టం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా
ఉందన్నారు. స్థానిక సంస్థల హక్కులూ హరించే విధంగా ఉందని విమర్శించారు.
సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలే ఇళ్లు నిర్మించి ఇస్తాయని,
కొనుగోలు చేసుకోలేకపోతే సాధారణ ఖర్చులతో ఇళ్లను కేటాయిస్తాయని,
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అటువంటి సౌలభ్యం ఉంటుందా అని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ నుండి నిపుణులను తీసుకొచ్చిన చంద్రబాబు మన
దేశంలో, రాష్ట్రంలో ఉన్న నిపుణులతోనూ మరోప్లాను రూపొందించి రెండింటిలో ఏదీ
దేశ, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటే దాన్ని అమలు చేయవచ్చని
సూచించారు.
No comments:
Post a Comment