వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తించకుంటే రైతు సాధికారత సభలు ఎందుకంటూ రైతులు
ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పెసర్లంక, కోనేటిపురం, గొరికపూడిలో
సదస్సులు నిర్వహించారు. పెసర్లంక సదస్సులో రైతులు రుణమాఫీ పై అధికారులను
నిలదీశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వాణిజ్య పంటలకు ఓ పక్క
మద్దతు ధర లేక నష్టాలు చవిచూస్తుంటే రుణమాఫీ పేరుతో ప్రభుత్వం వాణిజ్య పంట
రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ అవుతుందనే ఉద్దేశంతో తాము
ఓట్లు వేశామని, తీరా గెలిచాక వరి పంటకే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడం
ఏమిటని ప్రశ్నించారు. వాణిజ్య పంటలకూ రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు
చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతులు అర్జీలిచ్చేందుకు వేచి చూడాల్సి వచ్చింది. తహశీల్దార్ అంకారావు
మాట్లాడుతూ రుణమాఫీ కానివారు ఈసేవాను సంప్రదించాలని సూచించారు. జన్మభూమి
కమిటీవారికి అర్జీలివ్వాలని ప్రభుత్వం ప్రకటించింది కదా అని పలువురు
మండిపడ్డారు. రోజుకో ప్రకటనతో తమకు అయోమయంగా ఉందని నిట్టూర్చారు.
No comments:
Post a Comment