మోడీ ప్రభుత్వం రైతుల ప్రయో జనాలను దెబ్బతీసేలా భూ సేకరణ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపింది.దేశంలోని బడా కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ల ప్రయోజనాల కోసం భూసేకరణ
చట్టంలో రైతులకు రక్షణ కల్పిస్తున్న నిబంధనలను సడలిస్తూ రూపొందించిన
ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది. ప్రైవేటు
విద్యుత్, గృహనిర్మాణం వంటి రంగాలకు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవ
డానికి ఇది వీలు కల్పిస్తుంది.గత ఏడాది యుపిఎప్రభుత్వం రూపొందించిన భూసేక రణ చట్టంలోని కొన్ని నిబంధనలు
అడ్డంకిగా మారటంతో దాదాపు రు.1.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు
నిలిచిపోయాయని ప్రభుత్వం చెబుతోంది.రక్షణ, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ గృహనిర్మాణం, పారిశ్రామిక కారిడార్ల
వంటి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సేకరించే సందర్భంలో ప్రభావిత యజమానుల్లో
80 శాతం మేర సమ్మతి పొందాలన్న నిబంధనకు తాజా ఆర్డినెన్స్
మినహాయింపునిచ్చింది. తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఆయా ప్రాజెక్టుల కోసం
భూమిని సేకరించే సందర్భాలలో 80 శాతం యజమానుల నుండి సమ్మతి పొందాల్సిన
అవసరంతోపాటు సామాజిక ప్రభావాన్ని అంచనా వేయటం, ఆహార భద్రతపై దాని
ప్రభావాన్ని అంచనా వేయటం వంటి నిబంధనలకు కూడా తిలోదకాలిచ్చింది. ఈ నెల 23న
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత మోడీ సర్కారు అప్రజాస్వామిక పద్ధతిలో
తీసుకొచ్చిన మూడవ ఆర్డినెన్స్ ఇది.
No comments:
Post a Comment