Communist party of India (Marxist) - Andhra Pradesh
Sunday, 28 December 2014
రాజధాని నిర్మాణానికి 30 ఎకరాల నుండి 300 ఎకరాలు చాలు..
2013 భూసేకరణ చట్టంలో 80శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూసేకరణ జరపాలని
ఉన్న చట్టాన్ని ప్రస్తుతం 50శాతానికి తగ్గించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద
రాయబేరాలు చేస్తున్నారని బివి.రాఘవులు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజి నుండి అమరావతి వెళ్ళే కృష్ణానది కరకట్ట మీద ఎడంవైపున
ఉన్న రైతుల భూములు తీసుకుంటాననడంలో మర్మమేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని
ప్రశ్నించారు. కుడివైపున ఉన్న భూముల జోలికి ఎందుకు పోరని అడిగారు. బడాబడా
పెట్టుబడిదారులకు సంబంధించిన వందలాది ఎకరాలు ప్రకాశం బ్యారేజి నుండి
అమరావతి వరకు కరకట్టకు కుడివైపున ఉన్న భూముల్లో రాజధాని నిర్మించాలని
కోరారు. రాజధాని భూముల సేకరణ కార్పోరేట్ శక్తులకోసం కాదా సమాధానం చెప్పాలని సవాల విసిరారు.మొదటి విడతలో 30వేల ఎకరాలు, మలి విడతల్లో మొత్తం కలిపి లక్ష ఎకరాల సేకరణ
ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు.ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియేట్, ఎమ్మెల్యే
క్వార్టర్స్, మంత్రుల నివాసాలు, అన్ని కలిపినా వంద ఎకరాల్లో నిర్మాణాలు
జరిగాయని, ఇక్కడ అన్ని ఎకరాల భూమి అసలు ఎందుకని ప్రశ్నించారు.ప్రభుత్వం క్రీడా బిల్లును తీసుకొచ్చి తాము చెప్పినట్లు వినకపోతే రైతులను కేసులు పెట్టి అరెస్టులుచేస్తానని చెప్పడం దారుణమన్నారు. సింగపూర్ అని జపం చేస్తున్న
ముఖ్యమంత్రి అక్కడ రాజధానిని సముద్రంలో నిర్మించారని, నవ్యాంధ్రలో కూడా
బందరులో సముద్రం ఉందని అక్కడ నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని,
ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆహ్లాదం కూడా దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు
విసిరారు.
No comments:
Post a Comment