అందరికన్నా నాథూరాం వినాయక్ గాడ్సే గొప్ప దేశభక్తుడు'' అని సాక్షి
మహారాజ్ (భాజాపా ఎం.పి.) అంటాడు. ''భగవద్గీతే ''అందరికి పవిత్ర గ్రంథం''
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంటారు. ''దేశంలో రాముడి సంతానం గెలవాలో -
అక్రమ సంతానం గెలవాలో తేల్చుకోండి'' అని మరో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్
జ్యోతి అంటారు. ''హిందూ సంస్కృతికి మేమే ధర్మకర్తలం, తిరుగులేని స్వయం
సేవకులం అని సంఫ్‌ు పరివార్. ఇక మోదీ, అమిత్‌షా స్వచ్ఛ ప్రవచనాలు. కమల దళం హిందుత్వ ప్రతినిధులమంటూ మతిమాలిన చేష్టలు చేస్తున్నారు.. ఉత్తరప్రదేశ్‌లో ''ముస్లిం, క్రైస్తవ
కుటుంబాలను హిందూ మతంలోకి మార్పించే ప్రక్రియకు దండిగా చందాలివ్వండి'' అని
కరపత్రమే వేశారు. ధరమ్ జాగరణ్ సమితి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థగా
అవతరించింది. మతం మార్పించే ప్రక్రియకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును తాను
అందిస్తానంటూ ఓ నాయకుడు ప్రదర్శించిన వాచాలత్వం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం
సృష్టించింది. పైగా క్రిస్మస్ రోజున కనీసం 6 వేల మంది హిందూ మత స్వీకరణకు వీలుగా
కార్యక్రమం చేపట్టాలని కరపత్రాలు పంచుతున్నారు. అంటే ముంచుకొస్తున్న
మతోన్మాద ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంది.
No comments:
Post a Comment