పెట్టుబడిదారుల నైజం మారవు గాక మారవు. ఇది చరిత్ర చెప్పిన
సత్యం. ఉత్పత్తి జరుగుతుందని, ఉద్యోగాలొస్తాయని కంపెనీలకు వేల ఎకరాల భూములు
అప్పనంగా అప్పజెపితే ... అసలు కంపెనీలే పెట్టకుండా ఆ భూముల్ని
తెగనమ్ముకుని లాభాలు జేబులో వేసుకుంటున్నారని 'కాగ్' తాజా నివేదికలో
తెలిపింది. ఈ విధానంలో పరిశ్రమలు కాదు, భూమి కీలకమైన, ఆకర్షణీయమైన
వస్తువుగా మారిపోయింది. సెజ్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించిన 45,636
ఎకరాల నోటిఫైడ్ భూమిలో కేవలం 28,488 ఎకరాల్లో మాత్రమే కార్యకలాపాలు
ప్రారంభమయ్యాయి. మిగతా భూమి గడువు పేరుతో డి-నోటిఫై చేసి తమ వాణిజ్య
ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనీ, పచ్చటి పొలాల్లో చిచ్చు పెట్టారనీ
కాగ్ నివేదికలో మొట్టికాయవేసింది. గత పదేళ్ళుగా ఇదే తంతు సాగుతోంది.
ఎడాపెడా రాయితీలు గుప్పించడం వల్ల ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)లోకి
పెట్టుబడులు వెల్లువెత్తి ఉపాధి కల్పన ఇంతలంతలవుతుందని గత మన్మోహన్
సర్కారు ఊదరగొట్టింది. 2005లో ప్రత్యేక చట్టాన్నీ వండి వార్చింది.for more..see
No comments:
Post a Comment