రాజధాని పేరుతో అధికార పార్టీకి చెందిన పెద్దలు బినామీ పేర్లతో పెద్దఎత్తున
భూములు కొనుగోలుచేసి లాభపడ్డారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే
విషయం బయటకు వస్తుందని రాఘవులు అన్నారు.భూ సమీకరణ వల్ల లాభం ఉంటుందని చెబుతున్న
చంద్రబాబు ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగకపోతే ప్రభుత్వమే కొనుగోలు
చేస్తుందనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎకరాకు కనీసం
రూ.4 కోట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో భూములు ఇవ్వొద్దని ఆయన రైతులకు
సూచించారు. తాడేపల్లి ప్రాంతంలో పరిశీలన అనంతరం ఏర్పాటుచేసిన సభలో రాఘవులు మాట్లాడుతూ
రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం
ప్రయత్నిస్తోందన్నారు. నిజంగా రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం
ఉంటే ఆ భూముల్లో ఎక్కడ ఏం నిర్మిస్తున్నారో ముందుగానే స్పష్టం చేయాలని
డిమాండు చేశారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే
భూములు మినహా మరెక్కడా భూములు లేవని చంద్రబాబు చెబుతున్నారని, దీనిలో
వాస్తవం లేదని, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు.
No comments:
Post a Comment