దేశంలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న బీమా రంగంలో విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 26 శాతం
నుంచి 49 శాతానికి పెంచేందుకు వీలు కల్పించే చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ
రంగానికి చెందిన యావత్ సిబ్బందే గాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
వ్యక్తమవుతోంది.మతోన్మాద ఎజెండాను తెరపైకి తెచ్చి పార్లమెంటు శీతాకాల
సమావేశాలు సజావుగా
సాగకుండా చేసింది. ఇప్పుడు దానిని సాకుగా చూపి అప్రజా స్వామిక పద్ధతుల్లో
ఆర్డినెన్స్ తేవడం బిజెపి ప్రభుత్వ తెంపరితనాన్ని తెలియజేస్తోంది. ఏదైనా
బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్నప్పుడు అది పార్లమెంటు ఆస్తి కిందకే
వస్తుంది. అటువంటి బిల్లుపై అడ్డగోలుగా ఆర్డినెన్స్ తేవడం పార్లమెంటరీ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి,
దేశంలోని బడా కార్పొరేట్ సంస్థల లాభాల దాహార్తిని తీర్చడమే ఈ
ప్రభుత్వానికి ముఖ్యమైపోయింది.
No comments:
Post a Comment