Communist party of India (Marxist) - Andhra Pradesh
Tuesday, 30 December 2014
బలవంతంగానైనా భూసమీకరణ..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

గ్రామ పంచాయతీలు నిర్వీర్యం..?

Monday, 29 December 2014
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా భూ సేకరణ ఆర్డినెన్సు..

నేడు పొలాలు.. రేపు రైతులా ..?

కార్మిక చట్టాల్లో మార్పు ప్రతిపాదనలు...చట్ట సవరణ ప్రభావం
వాస్తవానికి కార్మికవర్గం చట్టాలను పురోగమన దిశగా మార్చాలని కోరుకుంటున్నది .కాని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను తిరోగమన దిశకు మార్చడానికి పూనుకుంటోంది . దీని ప్రభావం చాల తీవ్రంగా వుంటుంది . కార్మికుల తొలగింపు,కంపెనీలు లోకౌట్ ,లే ఆఫ్ ,మూసివేతలకు ప్రభుత్వ అనుమతులు,వేతన ఒప్పందాలు తదితర ముక్య అంశాలకు సంభందించిన కార్మిక వివాదాల చట్టం 1947 ను 300 మంది లోపు వున్న పరిశ్రమలకు వర్తించకుండా చట్టని మారిస్తే దేశంలో 80 శాతం కార్మికులకు చట్టమే వర్తించకుండా పోతుంది .కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని ఇప్పుడున్న ఒక కాంట్రాక్టర్ వద్ద 20 మందికి వర్తించే బదులు 49 మంది వరకు వర్తించితే 80 శాతం అమంది చట్ట పరిధి నుంచి బయటకు పోతారు . ఫ్యాక్టరీ చట్టం 50 అమంది మత్త్రమే వున్న పరిశ్రమలకు అమలు చేస్తే 71.3శాతం పరిశ్రమలకు వర్తించకుండా పోతుంది. ఇప్పుడునన్ చట్టాల్లో అనేక లొసుగులు వున్నాయి . హత్య చేసిన నేరస్తుడుకుడా నేరుగా కోర్ట్ కి వెళ్ళచ్చు . కానీ కార్మికుడు నేరుగా కోర్ట్ కి వెళ్ళే విధంగా కార్మిక చట్టాలు లేవు . లేబర్ ఆఫీసర్ వద్ద విచారణ జరిగి కన్విఎషన్ విచారణలో అధికారులు అనుమతి ఇస్తేనే కార్మికుల తొలగింపు న్యాయమా ?అన్యాయమా? అని కార్మిక కోర్ట్ విచారిస్తుంది . బోనస్ ,గ్రాట్యుటి చట్టంలో సీలింగ్ విధించారు . పెన్షన్ చట్టాలు మార్పు చేసి వచ్చే పెన్షన్ ను రాకుండా చేసారు . నష్టపరిహార చట్టం ప్రకారం కార్మికునికి నెల జీతం 10 వేలు దాటితే చట్టం వర్తించదు. సీలింగుల పేరుతొ అనేక చట్టం అమలుకాకుండా చట్టాలు చేసినపుడే యజమానులకు లాభించేల నేటికి చట్టాలు వున్నాయి .
Sunday, 28 December 2014
రాజధాని నిర్మాణానికి 30 ఎకరాల నుండి 300 ఎకరాలు చాలు..

ఎకరాకు కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి..

సిఆర్డిఏ చట్టం కార్పొరేట్ శక్తులకు అనుకూలం

Saturday, 27 December 2014
పాలకులా? మత ప్రచారకులా?
Friday, 26 December 2014
బలిపీఠం పై భీమా రంగం..
దేశంలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న బీమా రంగంలో విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 26 శాతం
నుంచి 49 శాతానికి పెంచేందుకు వీలు కల్పించే చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ
రంగానికి చెందిన యావత్ సిబ్బందే గాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
వ్యక్తమవుతోంది.మతోన్మాద ఎజెండాను తెరపైకి తెచ్చి పార్లమెంటు శీతాకాల
సమావేశాలు సజావుగా
సాగకుండా చేసింది. ఇప్పుడు దానిని సాకుగా చూపి అప్రజా స్వామిక పద్ధతుల్లో
ఆర్డినెన్స్ తేవడం బిజెపి ప్రభుత్వ తెంపరితనాన్ని తెలియజేస్తోంది. ఏదైనా
బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్నప్పుడు అది పార్లమెంటు ఆస్తి కిందకే
వస్తుంది. అటువంటి బిల్లుపై అడ్డగోలుగా ఆర్డినెన్స్ తేవడం పార్లమెంటరీ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి,
దేశంలోని బడా కార్పొరేట్ సంస్థల లాభాల దాహార్తిని తీర్చడమే ఈ
ప్రభుత్వానికి ముఖ్యమైపోయింది.
Thursday, 25 December 2014
రైతుల జీవితాలతో రాక్షస క్రీడలు..మారని బాబు సర్కార్ తీరు !
Wednesday, 17 December 2014
వేల కోట్ల నష్టం..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం
Tuesday, 16 December 2014
ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయ పరచడంలో మోడీ విఫలం:

టి.డి.పి ప్రభుత్వం ఫై రైతుల్లో తొలగుతోన్న బ్రమలు

Sunday, 14 December 2014
మళ్లీ తెరపైకి మోడీ ప్రభుత్వ మతతత్వ అజెండా..
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల రూపంలో మతతత్వ అజెండాను ఉధృతం చేస్తోంది . లవ్ జిహాద్, సాధ్వి వ్యాఖ్యలు,
చరిత్ర పుస్తకాల్లో మార్పులు, భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా
ప్రకటించాలనడం, బలవంతపు మత మార్పిడులు, గాంధీని చంపిన గాడ్సేను పొగడడం
ఇలా రకరకాల రూపాల్లో ఆరెస్సెస్, బిజెపిలు తమ ఫాసిస్టు అజెండాను ముందుకు
తెస్తూన్నాయి.. ముస్లింలు, క్రైస్తవుల్లో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో మతానికి
ఒక్కో రేటు నిర్ణయిస్తూ దానిని పక్కాగా అమలు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్లో ముస్లింలతోబాటు క్త్రెస్తవులపై ఒత్తిడి
తెచ్చి బలవంతంగా మత మార్పిడి గావించడానికి సంఫ్‌ు శక్తులు వేసిన పథకం
ఆధారాలతో సహా మీడియాకు లభ్యమైంది. గతంలో హిందువులు ఎక్కడైనా స్వచ్ఛందంగా
ఇతర మతాల్లోకి మారితే వాటిని బలవంతపు మత మార్పిడులంటూ నానా యాగీ చేసిన
ఆరెస్సెస్, బిజెపిలు ఇప్పుడు తామే ఆ పనికి తెగబడడం వాటి ద్వంద్వ వైఖరిని
తెలియజేస్తోంది.
ఊరు పేరు లేని 'బాబు' రైతు రుణ విముక్తి పత్రమ్..
'రైతు రుణ విముక్తి పత్రం' అధికార పార్టీ కరపత్రంలా ఉంది.
రైతు సాధికారిక సంస్థ పేరుతో ఇస్తున్న పత్రాల్లో ఆ సంస్థ ముద్ర (సీలు)గానీ, అధికారి పేరుగానీ లేదు. అసలు రైతుకు సంబం ధించి ఏ బ్యాంకు ఖాతాలో ఎంత బాకీ ఉన్నదీ, ఏ ఖాతాలో ఎంత రుణం మాఫీ అయింది అనే వివరాలూ లేవు. పైగా ఆ పత్రం రాజకీయ విమర్శలు, బ్యాంకులపై ఆరోప ణలతో కూడుకుని ఎవరైనా తప్పుబట్టేందుకు అవకాశం కల్పించేలావుంది.ఎన్నికల్లో వేసే ప్రచార కరప్రతంలా ఉన్న ఈ పత్రాలకు బ్యాంకులు ఏ విధంగా విలువనిస్తాయో ప్రభుత్వానికే తెలియాలి. ఈ పత్రాలను పంపిణీ చేస్తున్న ఎంపిడిఓలు, ఎంఆర్వోలే పెదవి విరుస్తున్నారు. బ్యాంకుల్లో ఏమాత్రం విలువలేని పత్రాలను పంపిణీ చేసి, అవి బ్యాంకుల్లో ఉపయోగపడతాయని చెప్పడం అధికారులుగా మాకు ఇబ్బందికరంగా ఉందంటున్నారు రుణ పత్రమా.. కరపత్రమా

ఎ.పి లో అధికార,ప్రతిపక్షానికి తేడా లేదు..సింగపూర్ మీడియా
ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభు త్వాల మధ్య కుదిరిన రాజధాని ఒప్పందం సింగపూర్ లోనూ చర్చనీయాంశమైంది.
'ది స్ట్రైట్స్ టైమ్స్' అనే పత్రిక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా సింగపూర్ ప్రభుత్వం కుదుర్చు కున్న ఒప్పందానికి ఢోకా ఉండదని ఈ పత్రిక పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయా లను ఈ పత్రిక పోల్చింది. తమిళనాడులో అధికార ఎఐడిఎంకే, ప్రతిపక్ష డిఎంకేల మధ్య కక్ష్యసాధింపు రాజకీయాలు ఉన్నాయని, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది..'బాబు ఓడినా ఢోకాలేదు
Wednesday, 10 December 2014
సి.పి.ఎం (మాగ్జిన్స్)
Here u can know about CPM's familiar magazines like Marxist,Karmikalokam etc..
ఆరునెలల అడియాసలు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయనపై ఎన్నో
ఆశలు! విభజన నేపధ్యంలో చుట్టుముట్టిన సమస్యల వలయం నుండి రాష్ట్రాన్ని
బయటపడే స్తారని ప్రజానీకం ఆశించారు. . ఉధృతంగా సాగిన ఈ ప్రచారంతో
ప్రజానీకం టిడిపికి పట్టం కట్టారు.
ప్రజానీకం పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కారు ప్రయాణం చేస్తున్న తీరు క్లుప్తంగా :
రుణమాఫీ
ఎన్నికల ప్రచారంలో వ్యవసాయరుణా లన్నింటిని మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత, డ్వాక్రా రుణాలనూ రద్దు చేస్తామని ప్రకటించారు. . ప్రమాణస్వీ కారం నాడు మాఫీ ఫైలుకు బదులుగా విధివిధానాల కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై బాబు సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయ రుణాలు కాస్తా పంటరుణాలుగా మారాయి. కుటుంబానికి 1.50 లక్షల రూపాయలకే పరిమితి విధించారు. ఆధార్, రేషన్, ఓటర్‌కార్డులంటూ ఆంక్షలు పెట్టి లబ్ధిదారుల జాబితాను సగానికి తగ్గించివేసింది. నాలుగురోజుల క్రితం చేసిన విధాన ప్రకటనలో కుటుంబానికి 50 వేల రూపాయలు రుణం ఉన్న వారికే తక్షణం మాఫీ వర్తిస్తుందని చెప్పారు. లబ్ధిదారుల జాబితాను జన్మభూమి సభల్లో ఖరారు చేయాల్సిఉంది. ఆ ప్రక్రియ ముగిసి, బ్యాంకర్లకు నగదు చేరితేకాని ఎందరికి లబ్ధి చేకూరిందన్న విషయంపై స్పష్టత రాదు. ఇక డ్వాక్రా, చేనేత రుణ మాఫీల గురించి మాట్లాడటానికి కూడా ప్రభుత్వం సిద్దపడటం లేదు.
రాజధాని
సింగపూర్ తరహాలో ప్రపంచస్థాయి రాజధానిని తీర్చిదిద్దుతామని, ప్రజా రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు పదేపదే చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తరువాత క్రిడా (కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ-సిఆర్డిఎ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో రాజధానికి భూముల కోసం సమీకరణ విధానాన్ని ముందుకు తెచ్చిన ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను తుంగలో తొక్కే దిశలో పయణిస్తోంది. .ఈ ప్రక్రియలో స్థానికుల నుండి వస్తున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తోంది. వ్యవసాయకార్మికలు,కౌలురైతులు, ఇతర వృత్తుల వారి ఊసును విస్మరిస్తూ కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తోంది.రాజధాని నిధుల విషయంలోనూ ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఫించన్ల కోత
అధికారంలోకి వచ్చిన 100రోజుల తరువాత ఫించన్ల పెంపు ప్రకటనను ప్రభుత్వం చేసింది. అదే సమయంలో పలు ఆం క్షలను, విధించింది. వృధ్దాప్య ఫించన్‌ను కుటుంబానికి ఒకరికే పరిమితం చేసింది. అనర్హుల పేరుతో పెద్దఎత్తున కోత పెట్టింది. ఫించను రాదని తెలుసుకున్న కొందరు వృధ్ధులు జన్మభూమి సభల్లోనే ప్రాణాలు విడిచారు.
ప్రత్యేకహోదా ...
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైనప్పటికీ ఆరునెలలు గడిచినా ఆ దిశలో సానుకూల నిర్ణయం వెలువడలేదు.. ప్రత్యేకహోదాతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజిలు, నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది.
అన్న క్యాంటిన్లు ... సుజల స్రవంతి
పేదవాడికి తక్కువ ధరకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రకటించిన అన్నక్యాంటిన్లు ఎప్పుడు ఏర్పాటవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. నివేదికలు సిద్దమయ్యాయి కానీ, అమ లుకు తెచ్చే విషయంలో సర్కారు సాచివేత ధోరణి తో వ్యవహరిస్తోంది. ప్రమాణస్వీకారం నాడే సంత కం చేసిన ఎన్టిఆర్ సుజల స్రవంతిదీ ఇదే బాట.
'బెల్టు' తీసి షాపులు పెట్టారు
ప్రమాణస్వీకార సభలో బెల్టుషాపులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఫైలుపై సంతకం కూడా చేశారు. ఆచరణలో వాటి స్థానంలో అధికారికంగా మద్యం షాపులకు అనుమతిచ్చారు. మద్యం షాపులను విపరీతంగా పెంచారు. మండల, గ్రామ స్థాయిలో కూడా జనాభా సంఖ్యను బట్టి షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిరుద్యోగులకు నిరాశే!
ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆచరణలో ఉన్న ఉపాధిని ఊడగొట్టే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. అంగన్వాడీలు, మధ్యాహ్నాభోజన కార్మికుల ఉపాధి ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితి నెలకొంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

Monday, 8 December 2014
ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు మరచిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం..

పర్యవసానంగా ఐస్లాండ్ భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చాలా మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.సింగపూర్ జరుగుతున్న ఆర్థికాభివృద్ధి ఐస్‌లాండ్‌తో సారూప్యం కలిగిఉండటమే కాకుండా దీని ముగింపు కూడా ఐస్లాండ్ తరహాలోనే ఉండే అవకాశం కనపడుతున్నది.సింగపూర్ జపం పర్యవసానాలేమిటో?
మోడీ హయంలో ప్రణాళికాసంఘం ఉనికి ప్రస్నార్ధకం ..

అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం.అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం.
Sunday, 7 December 2014
సెజ్‌ల ముసుగులో...

Saturday, 6 December 2014
Friday, 5 December 2014
Subscribe to:
Posts (Atom)