Communist party of India (Marxist) - Andhra Pradesh
Wednesday, 7 January 2015
అశాస్త్రీయ జనతా పార్టీ..
విద్యారంగంలో అశాస్త్రీయతను చొప్పించేందుకు బి.జె.పి ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య అన్నారు.దేశానికే కాకుండా
ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో తమ వంతు కృషిని అందిస్తున్న ఎందరో భారతీయ శాస్త్రవేత్తలను అవమానపరిచేలా బి.జె.పి వ్యవహరిస్తోందన్నారు. వినాయకుడికి ఏనుగు ముఖాన్ని తగిలించడం ప్లాస్టిక్ సర్జరీయేననీ,
కుంతీదేవికి కర్ణుడు జన్మించిన తీరు టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కన్నా
పురోగామి అనీ ప్రధాని మోడీ అనడంచూస్తుంటే అశాస్త్రీయతకు బి.జె.పి కాషాయ జెండా ఊపుతోందని విమర్శించారు. వంద రోజుల్లోనే విదేశాలలోని నల్లధనం 75 లక్షల కోట్ల రూపాయలను బయటికి
తెస్తానని హామీ ఇచ్చిన మోడీ మేకిన్ ఇండియా పేరుతో ఆ మొత్తాన్ని
కార్పోరేట్లకే ఇస్తున్నారన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినిర్వీర్యం చేయడంతోపాటు మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత
దేశంలో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మోడీ,చంద్రబాబు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జగన్
ఏమీ మాట్లాడడం లేదని, బిజెపి సవాళ్ళను జగన్ స్వీకరించే పరిస్థితిలో లేరని
అన్నారు. వారికి ధీటైన సమాధానం చెప్పే శక్తి కేవలం సిపిఎం
కే ఉందన్నారు.
No comments:
Post a Comment