Communist party of India (Marxist) - Andhra Pradesh
Tuesday, 6 January 2015
రుణమాఫీ తొలిదశలోనే విఫలం...
తొలిదశ రుణమాఫీ అమలులోనే రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు,బ్యాంకర్లు పూర్తిగా విఫలమయ్యారు. మాఫీకి బ్యాంకర్లు సహకరించక పోవడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకర్లు రుణమాఫీకి సహకరించాలని కోరారు. రుణమాఫీలో రెండోదశ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నందున
తొలిదశను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.తొలిదశ రుణమాఫీనే ఇంకా పూర్తిగా ఆచరణకు నోచుకోని తరుణంలో రెండోదశ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే దానిపై గందరగోళం నెలకొనివుంది.
No comments:
Post a Comment