Communist party of India (Marxist) - Andhra Pradesh
Sunday, 4 January 2015
4000 కోట్లు వరకూ ప్రజలపై భారం.. వై.వి
విజయవాడ ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు
చెబుతున్నారని, రాజధానికి భూములు ఎంత తీసుకుంటారు, ఏయే ప్రాంతాల్లో
నిర్మిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రకటించకుండా దాటవేస్తున్నారన్నారు.
భూములు కోల్పోయే రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారుల
గురించి పాలకులు పట్టించుకోవటం లేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు
సంక్రాంతి తర్వాత పెంచేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
సుమారు రూ. 4000 కోట్లు వరకూ ప్రజలపై భారం మోపేందుకు రంగం
సిద్ధంచేస్తున్నారన్నారు. పట్టణాలు, నగరాల్లో ఆస్తి, ఇతర పన్నులను
పెద్దఎత్తున పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఇటీవల మున్సిపల్
శాఖమంత్రి నారాయణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే టిడిపి,
బిజెపి పాలకులు కమ్యూనిస్టులపై సైద్ధాంతిక దాడికి దిగుతున్నారరి, దీన్ని
ఎదుర్కొనాలంటే పార్టీ శ్రేణులు మారుతున్న పరిస్థితులకనుగుణంగా అధ్యయాన్ని
పెంచుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment