
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా భూ సమీకరణ ద్వారా రైతులకు అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ చట్టవిరుద్ధమని, ప్రభుత్వం రైతుల వద్ద బలవంతంగా భూములను గుంజుకుంటుందని ఇలాంటి తంతూ ఒక్క రాజధాని ప్రాంతంలోనే కాదని, విశాఖపట్నం నుంచి కాకినాడ
వరకు ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల మంది రైతాంగం నష్టపోతుందని
తెలిపారు. రాజధాని ప్రాంతంలో 1.5లక్షల మంది దళితులు, గిరిజనులు ఉన్నారని వీరి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. భూ సమీకరణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కూడా అమలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రలోటు బడ్జెట్, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు వంటి అంశాల గురించి లేవనెత్తడం లేదని విమర్శించారు. ఈ చట్టవిరుద్ధమైన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment