క్లుప్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను
ఆహ్వానించి ప్రమాదం కొనితెస్తోంది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి
విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులకు లాభాలు తెచ్చే బిల్లులను ఆర్డినెన్స్
రూపంలో తెస్తోంది. ఒకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తెచ్చేవారు. ఈ ఆరు నెలల్లో తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చారు.'' ఏదైనా బిల్లు ఆమోదించాలంటే పార్లమెంటులో చర్చకు
పెట్టాలి. బిజెపి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇన్స్యూరెన్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి,
కోల్‌మైనింగ్‌ను ప్రయివేటీకరించటానికి ఆర్డినెన్స్ తేవడం ప్రజాస్వామ్యం
అనిపించుకోదు. ఈ ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అభ్యంతరం
చెప్పారు. జాతి సమగ్రతను కాపాడే లౌకికత్వాన్ని తుంగలో తొక్కు తున్నారు. మత పరమైన
విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు, ప్రాంతాల మధ్య చీలికలు తెస్తూ ఎన్నికల్లో
లబ్ధిపొందే విధానాలను అనుస రిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ ఇంత
ప్రచారం చేశాక పారిశ్రామికరంగం, ఉత్పత్తి రంగంలో గ్రోత్ రేటు -4.1
శాతానికి పడిపోయింది.ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు సగం తగ్గాయి. దాని ప్రకారం భారతదేశంలో
లీటరు పెట్రోలు రూ.35కి, డీజిల్ రూ. 30కి రావాలి. కానీ అలా జరగలేదు.
పెట్రోలు ధరలు తగ్గిన మూడు సార్లు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచింది.
ఒక్కోసారి రూ.70 వేల కోట్లు చొప్పున మూడు సార్లు పెంచడంతో ప్రభుత్వానికి
రూ. 2.10 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. కానీ ప్రజలమీద భారం మాత్రం అలాగే ఉంది.
No comments:
Post a Comment