సిపిఎం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంతో పాటు విజయవాడలో ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని శనివారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అరుణ పతాక యాత్రతో విజయవాడ నగరంఎరుపెక్కింది.వన్‌టౌన్‌లోని రథం సెంటరు నుంచి ప్రారంభమైన యాత్రలో 50 మీటర్ల మేర అరుణ పతాకాన్ని చేబూని రెడ్‌షర్ట్ వాలంటీర్లు లెనిన్ సెంటరు వరకు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా
సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను
బలోపేతం చేయడమే సిపిఎం ధ్యేయమన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకుల విధానాల్లో
మాత్రం మార్పు రావడం లేదన్నారు. మరో 20 ఏళ్లు పరిపాలన చేయాలని తెలుగుదేశం
పార్టీ, 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలించాలని ప్రతిపక్ష వైఎస్సార్ సిపి,
పోగొట్టుకున్న అధికారాన్ని, పదవులను ఎలా దక్కించు కోవాలని కాంగ్రెస్
పార్టీ ఆలోచన చేస్తున్నాయన్నారు. వామపక్ష పార్టీగా సిపిఎం మాత్రం పదవులతో
నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటం చేస్తోందని
స్పష్టం చేశారు. దేశ సమైక్యత, మత సామరస్యం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా
శ్రమిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ చుట్టూ తిరుగుతూ
రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని నిరుత్సాహపరిచే రీతిలో ప్రభుత్వం
వ్యవహరిస్తోందన్నారు.
No comments:
Post a Comment