Communist party of India (Marxist) - Andhra Pradesh
Tuesday, 10 February 2015
ఆకలి,దారిద్య్రంలో ఆఫ్రికాను మించిన భారతదేశం..
నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాలలో భారత్ ఒకటని నిరంతరం గుర్తు చేస్తుంటారు.అయితే ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతంగా భావిస్తున్నఆఫ్రికాను కూడా మించి భారతదేశంలోని దారిద్య్రం, ఆకలి ఉన్నదనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. దేశంలోని దారిద్య్రం అధికారికంగా వర్గీకరించిన 'అతి తక్కువ అభివృద్ధిచెందిన దేశాలను' మించిపోయింది.ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవటం, దాంతో మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కోనుగోలు చేయవలసిరావటం వల్లనే ప్రజల ఆహార వినియోగం తగ్గిందని తెలుసుకోవాలి.ఆహార ధాన్యాల వినియోగం తగ్గితే ఆకలి పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ఆకలి దారిద్య్రం తీవ్రతకు సంకేతం. విద్య, ఆరోగ్య సేవలను ప్రయివేటీకరించటమే దీనికి కారణం.
No comments:
Post a Comment