Communist party of India (Marxist) - Andhra Pradesh
Thursday, 12 February 2015
ఇదే నిజమైన ఐక్యత .. సి.పి.ఐ(ఎం)
వామపక్ష ఐక్యత అంటే ఉమ్మడి వేదికల మీద ఉమ్మడి నినాదాల ప్రాతిపదికపై ఏర్పడే ఐక్యత,ఐక్య ఉద్యమాలు,చర్యల ఆధారంగా ఏర్పడే ఐక్యత. ఇది నెరవేరాలంటే వామపక్ష శక్తులు మరింత ఎక్కువ,లోతైన అవగాహన ఏర్పరుచుకోవాలి.ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వామపక్షాల మధ్య మరింత సమన్వయo అవసరం.మతోన్మాద శక్తులకు,మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలపక్షాన నిలిచి వారి ప్రయోజనాలు కాపాడే శక్తి ఒక్క వామపక్షాలకు మాత్రమే వుంది.కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు,గ్రూపులు లౌకికతత్వంపై కేవలం మాటలకే పరిమితం అయ్యాయి.కేవలం వామపక్షాలు మాత్రమే లౌకికతత్వానికి కట్టుబడుతున్నాయనడంలో సందేహంలేదు.
No comments:
Post a Comment