ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు.
ఐఎమ్‌ఎఫ్ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్‌మార్కెట్ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు అభివృద్ధి రేటును నిలువరించడానికి గల కారణాల్లో తీసివేయలేనివని తెలియజేసింది. ఐఎమ్‌ఎఫ్ చీఫ్ ఆర్థికవేత్త బ్లాంచన్ ''మనం ఇప్పుడు క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి దశలో నడుస్తున్నాం'' అని అన్నారు. 2016లో 3.8 శాతం వృద్ధితో మరలా ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మందకొండి అభివృద్ధి, పేరుకుపోతున్న రుణాల కారణంగా నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నదని అంచనావేసింది. యూరప్‌లో గడచిన అయిదు సంవత్సరాల్లో మూడవ మాంద్యం త్రుటిలో తప్పినట్లు తన నివేదికలో పేర్కొంది. అభివృద్ధిచెందుతున్న దేశాల వృద్ధిరేటు ఏప్రిల్‌లో 2.4 శాతం ఉంటుందని చెప్పగా ప్రస్తుతం ఈ సంవత్సరానికి తాజాగా 2.1 శాతం ఉంటుందని తేల్చింది. అభివృద్ధిచెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, జపాన్‌లలో అంచనాల కంటే తక్కువ ఉంటుందని తెలియజేస్తోంది. అమెరికాలో ఏప్రిల్ 2015లో 3.1 శాతం అంచనా వేయగా, ఇప్పుడు 2.5 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అంటుంది.

No comments:
Post a Comment