సీఆర్డిఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలపడంతో రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని
ప్రభుత్వం నిర్ణయించింది.భూ సమీకరణపై రైతులకు బుధవారం నుంచి నోటీసులు పంపుతామని, ప్రభుత్వం ఏయే అవసరాల నిమిత్తం భూమి తీసుకుంటుందో వివరిస్తూ
నోటీసులిస్తారు. వీటిపై అభ్యంతరం ఉన్నా, భూమి ఇవ్వడానికి ఇష్టంలేకపోయినా 15
రోజుల్లోగా తెలియ జేయాలి.లేదంటే వారు భూమి ఇవ్వడానికి
అంగీకరించినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుని రశీదు
ఇస్తారు. అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా భూమి హక్కు పత్రాలను పరిశీలించి
సంబంధిత హక్కుదారులకు ఆరు నెలల్లోగా బాండ్లు ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ల
ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు వివరిస్తారు. అఫిడవిట్లు, భూమి
హక్కుపత్రాల పరిశీలన పూర్తయిన తరువాత బాండ్లు, కౌలు పరిహారం పంపిణీ
ప్రారంభం అవుతుంది. ఇందుకోసం 27
మంది డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి.
29 గ్రామాల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పరిధిలో
1000 నుంచి 1400 ఎకరాల స్థలం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ
కలెక్టర్ స్థాయి అధికారులను సీఆర్డిఏకు కేటాయిస్తుంది. వీరి ఆధ్వర్యంలో
ప్రతి బృందంలో ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు
సర్వేయర్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సర్వే విభాగం
సిబ్బంది, వీరితోపాటు స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు, ఒక కంప్యూటర్
ఆపరేటరు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తం 300 మంది రెవెన్యూశాఖ తరఫున రాజధాని
గ్రామాల్లో పనిచేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని
సంకల్పించామని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. Communist party of India (Marxist) - Andhra Pradesh
Tuesday, 30 December 2014
బలవంతంగానైనా భూసమీకరణ..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సీఆర్డిఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలపడంతో రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని
ప్రభుత్వం నిర్ణయించింది.భూ సమీకరణపై రైతులకు బుధవారం నుంచి నోటీసులు పంపుతామని, ప్రభుత్వం ఏయే అవసరాల నిమిత్తం భూమి తీసుకుంటుందో వివరిస్తూ
నోటీసులిస్తారు. వీటిపై అభ్యంతరం ఉన్నా, భూమి ఇవ్వడానికి ఇష్టంలేకపోయినా 15
రోజుల్లోగా తెలియ జేయాలి.లేదంటే వారు భూమి ఇవ్వడానికి
అంగీకరించినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుని రశీదు
ఇస్తారు. అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా భూమి హక్కు పత్రాలను పరిశీలించి
సంబంధిత హక్కుదారులకు ఆరు నెలల్లోగా బాండ్లు ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ల
ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు వివరిస్తారు. అఫిడవిట్లు, భూమి
హక్కుపత్రాల పరిశీలన పూర్తయిన తరువాత బాండ్లు, కౌలు పరిహారం పంపిణీ
ప్రారంభం అవుతుంది. ఇందుకోసం 27
మంది డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి.
29 గ్రామాల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పరిధిలో
1000 నుంచి 1400 ఎకరాల స్థలం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ
కలెక్టర్ స్థాయి అధికారులను సీఆర్డిఏకు కేటాయిస్తుంది. వీరి ఆధ్వర్యంలో
ప్రతి బృందంలో ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు
సర్వేయర్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సర్వే విభాగం
సిబ్బంది, వీరితోపాటు స్థానిక వీఆర్వోలు, వీఆర్ఏలు, ఒక కంప్యూటర్
ఆపరేటరు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తం 300 మంది రెవెన్యూశాఖ తరఫున రాజధాని
గ్రామాల్లో పనిచేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని
సంకల్పించామని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం..?
రాజధాని పరిపాలన కోసం ఏర్పాటు చేసిన సిఆర్డిఎ చట్టం కార్పొరేట్లకు
అనుకూలంగా ఉందనీ, దీనిని తక్షణమే సవరించాలనీ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు.మార్క్సిస్టు అగ్రనేత మాకినేని బసవపున్నయ్య
శత జయంతోత్సవాల్లో భాగంగా మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన
'నవ్యాంధ్ర నిర్మాణం' అనే అంశంపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపర దుర్గ
శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడారు. సిఆర్డిఎ
పరిధిలోని గ్రామ పంచాయతీల గురించి బిల్లులో ఎక్కడా పొందుపరచలేదన్నారు.
దీంతో గ్రామ పంచాయతీలు ఉంటాయా లేక రద్దవుతాయా అనే సందిగ్ధం నెలకొందన్నారు. ఈ
చట్టం రైతులకు అన్యాయం జరిగే విధంగా ఉందని తెలిపారు. రాజధానికి భూములిచ్చే
వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు.రాజధాని నిర్మాణానికి దేశంలో ఉన్న మేథాసంపత్తిని ఉపయోగించుకోకుండా సింగపూర్ వారిపై ఆధారపడటం మంచిదికాదన్నారు. . నూతన రాజధాని పరిపాలనా రాజధానిగా ఉండాలే కానీ మహానగరంగా ఉండకూడదన్నారు.
రైతుల భూముల్లో ప్రభుత్వం భవనాలు నిర్మించుకోవాలని చూస్తోందని, అందువల్ల
ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేసేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వం మహానగరానికీ, రాజధానికీ లింకు పెడుతోందని పేర్కొన్నారు. ఏ
దేశమైనా ఓడరేవులు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడం
ద్వారానే అభివృద్ధి సాధించిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని
తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి
చెందుతాయన్నారు. Monday, 29 December 2014
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా భూ సేకరణ ఆర్డినెన్సు..
మోడీ ప్రభుత్వం రైతుల ప్రయో జనాలను దెబ్బతీసేలా భూ సేకరణ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపింది.దేశంలోని బడా కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ల ప్రయోజనాల కోసం భూసేకరణ
చట్టంలో రైతులకు రక్షణ కల్పిస్తున్న నిబంధనలను సడలిస్తూ రూపొందించిన
ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది. ప్రైవేటు
విద్యుత్, గృహనిర్మాణం వంటి రంగాలకు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవ
డానికి ఇది వీలు కల్పిస్తుంది.గత ఏడాది యుపిఎప్రభుత్వం రూపొందించిన భూసేక రణ చట్టంలోని కొన్ని నిబంధనలు
అడ్డంకిగా మారటంతో దాదాపు రు.1.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు
నిలిచిపోయాయని ప్రభుత్వం చెబుతోంది.రక్షణ, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ గృహనిర్మాణం, పారిశ్రామిక కారిడార్ల
వంటి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సేకరించే సందర్భంలో ప్రభావిత యజమానుల్లో
80 శాతం మేర సమ్మతి పొందాలన్న నిబంధనకు తాజా ఆర్డినెన్స్
మినహాయింపునిచ్చింది. తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఆయా ప్రాజెక్టుల కోసం
భూమిని సేకరించే సందర్భాలలో 80 శాతం యజమానుల నుండి సమ్మతి పొందాల్సిన
అవసరంతోపాటు సామాజిక ప్రభావాన్ని అంచనా వేయటం, ఆహార భద్రతపై దాని
ప్రభావాన్ని అంచనా వేయటం వంటి నిబంధనలకు కూడా తిలోదకాలిచ్చింది. ఈ నెల 23న
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత మోడీ సర్కారు అప్రజాస్వామిక పద్ధతిలో
తీసుకొచ్చిన మూడవ ఆర్డినెన్స్ ఇది. నేడు పొలాలు.. రేపు రైతులా ..?
గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర గ్రామాల్లో పథకం ప్రకారమే దుండగులు పంట పొలాలను,వ్యవసాయ పరికరాలను దగ్దం చేసినట్లు కనబడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
ప్రత్యేకించి భూసమీకరణను వ్యతిరేకించే గ్రామాల్లోనే ఒకే తరహాలో ఇవి జరగడం
పలు అనుమానాలకు తావిస్తున్నదని ఆయన చెప్పారు. భూసమీకరణను వ్యతిరేకించే
రైతులను భయబ్రాంతలుకు గురిచేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు
తెలుస్తోందన్నారు., దీనిపై వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా
శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం
చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆరు గ్రామాల్లోని 13 మంది రైతుల పంట పొలాకు నిప్పంటించిబీభత్సం
సృష్టించారు. బోర్లు, సూక్ష్మ సేద్యానికి ఉపయోగించే మోటార్లను ధ్వంసం
చేశారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ విధ్వంస కాండ కొన్ని గంటల పాటు
కొనసాగాయింది. పంటలను, గుడిసెలను మంటల పాలు చేయడం, పరికరాలను ధ్వంసం
చేయడంతో 50 లక్షల రూపా యల మేర నష్టం జరిగిఉంటుందని రైతు ప్రతి నిధులు అంచనా
వేస్తున్నారు.ఈ సంఘటనతో 11 గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసులను ప్రభుత్వం మొహరించింది. ఆ
గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇంటిలిజెన్స్, క్రైం పార్టీ, స్పెషల్ బ్రాంచీ,
ఏఆర్ పోలీసులతో గ్రామాలన్నీ నిండిపోయాయి.పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడిపోతున్నారు.. సంఘటనను పరిశీలిచేందుకు ఉండవల్లి, పెనుమాక పొలాలలకు చేరుకున్న మంత్రిని
రైతులు నిలదీశారు. దీనికి కారణం ఎవరో తేల్చాలని పట్టుబట్టారు. తాము పొలాలు
తగుల బెట్టామని మీరు ఎలా చెబుతారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో మంత్రి
అక్కడ నుంచి వెళ్లిపోబోతుండగా మరలా అడ్డుకున్నారు. తాము భూములివ్వబోమంటూ
నినాదాలు చేశారు. కార్మిక చట్టాల్లో మార్పు ప్రతిపాదనలు...చట్ట సవరణ ప్రభావం
వాస్తవానికి కార్మికవర్గం చట్టాలను పురోగమన దిశగా మార్చాలని కోరుకుంటున్నది .కాని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను తిరోగమన దిశకు మార్చడానికి పూనుకుంటోంది . దీని ప్రభావం చాల తీవ్రంగా వుంటుంది . కార్మికుల తొలగింపు,కంపెనీలు లోకౌట్ ,లే ఆఫ్ ,మూసివేతలకు ప్రభుత్వ అనుమతులు,వేతన ఒప్పందాలు తదితర ముక్య అంశాలకు సంభందించిన కార్మిక వివాదాల చట్టం 1947 ను 300 మంది లోపు వున్న పరిశ్రమలకు వర్తించకుండా చట్టని మారిస్తే దేశంలో 80 శాతం కార్మికులకు చట్టమే వర్తించకుండా పోతుంది .కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని ఇప్పుడున్న ఒక కాంట్రాక్టర్ వద్ద 20 మందికి వర్తించే బదులు 49 మంది వరకు వర్తించితే 80 శాతం అమంది చట్ట పరిధి నుంచి బయటకు పోతారు . ఫ్యాక్టరీ చట్టం 50 అమంది మత్త్రమే వున్న పరిశ్రమలకు అమలు చేస్తే 71.3శాతం పరిశ్రమలకు వర్తించకుండా పోతుంది. ఇప్పుడునన్ చట్టాల్లో అనేక లొసుగులు వున్నాయి . హత్య చేసిన నేరస్తుడుకుడా నేరుగా కోర్ట్ కి వెళ్ళచ్చు . కానీ కార్మికుడు నేరుగా కోర్ట్ కి వెళ్ళే విధంగా కార్మిక చట్టాలు లేవు . లేబర్ ఆఫీసర్ వద్ద విచారణ జరిగి కన్విఎషన్ విచారణలో అధికారులు అనుమతి ఇస్తేనే కార్మికుల తొలగింపు న్యాయమా ?అన్యాయమా? అని కార్మిక కోర్ట్ విచారిస్తుంది . బోనస్ ,గ్రాట్యుటి చట్టంలో సీలింగ్ విధించారు . పెన్షన్ చట్టాలు మార్పు చేసి వచ్చే పెన్షన్ ను రాకుండా చేసారు . నష్టపరిహార చట్టం ప్రకారం కార్మికునికి నెల జీతం 10 వేలు దాటితే చట్టం వర్తించదు. సీలింగుల పేరుతొ అనేక చట్టం అమలుకాకుండా చట్టాలు చేసినపుడే యజమానులకు లాభించేల నేటికి చట్టాలు వున్నాయి .
Sunday, 28 December 2014
రాజధాని నిర్మాణానికి 30 ఎకరాల నుండి 300 ఎకరాలు చాలు..
2013 భూసేకరణ చట్టంలో 80శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూసేకరణ జరపాలని
ఉన్న చట్టాన్ని ప్రస్తుతం 50శాతానికి తగ్గించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద
రాయబేరాలు చేస్తున్నారని బివి.రాఘవులు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజి నుండి అమరావతి వెళ్ళే కృష్ణానది కరకట్ట మీద ఎడంవైపున
ఉన్న రైతుల భూములు తీసుకుంటాననడంలో మర్మమేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని
ప్రశ్నించారు. కుడివైపున ఉన్న భూముల జోలికి ఎందుకు పోరని అడిగారు. బడాబడా
పెట్టుబడిదారులకు సంబంధించిన వందలాది ఎకరాలు ప్రకాశం బ్యారేజి నుండి
అమరావతి వరకు కరకట్టకు కుడివైపున ఉన్న భూముల్లో రాజధాని నిర్మించాలని
కోరారు. రాజధాని భూముల సేకరణ కార్పోరేట్ శక్తులకోసం కాదా సమాధానం చెప్పాలని సవాల విసిరారు.మొదటి విడతలో 30వేల ఎకరాలు, మలి విడతల్లో మొత్తం కలిపి లక్ష ఎకరాల సేకరణ
ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు.ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియేట్, ఎమ్మెల్యే
క్వార్టర్స్, మంత్రుల నివాసాలు, అన్ని కలిపినా వంద ఎకరాల్లో నిర్మాణాలు
జరిగాయని, ఇక్కడ అన్ని ఎకరాల భూమి అసలు ఎందుకని ప్రశ్నించారు.ప్రభుత్వం క్రీడా బిల్లును తీసుకొచ్చి తాము చెప్పినట్లు వినకపోతే రైతులను కేసులు పెట్టి అరెస్టులుచేస్తానని చెప్పడం దారుణమన్నారు. సింగపూర్ అని జపం చేస్తున్న
ముఖ్యమంత్రి అక్కడ రాజధానిని సముద్రంలో నిర్మించారని, నవ్యాంధ్రలో కూడా
బందరులో సముద్రం ఉందని అక్కడ నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని,
ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆహ్లాదం కూడా దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు
విసిరారు. ఎకరాకు కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి..
రాజధాని పేరుతో అధికార పార్టీకి చెందిన పెద్దలు బినామీ పేర్లతో పెద్దఎత్తున
భూములు కొనుగోలుచేసి లాభపడ్డారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే
విషయం బయటకు వస్తుందని రాఘవులు అన్నారు.భూ సమీకరణ వల్ల లాభం ఉంటుందని చెబుతున్న
చంద్రబాబు ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగకపోతే ప్రభుత్వమే కొనుగోలు
చేస్తుందనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎకరాకు కనీసం
రూ.4 కోట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో భూములు ఇవ్వొద్దని ఆయన రైతులకు
సూచించారు. తాడేపల్లి ప్రాంతంలో పరిశీలన అనంతరం ఏర్పాటుచేసిన సభలో రాఘవులు మాట్లాడుతూ
రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం
ప్రయత్నిస్తోందన్నారు. నిజంగా రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం
ఉంటే ఆ భూముల్లో ఎక్కడ ఏం నిర్మిస్తున్నారో ముందుగానే స్పష్టం చేయాలని
డిమాండు చేశారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే
భూములు మినహా మరెక్కడా భూములు లేవని చంద్రబాబు చెబుతున్నారని, దీనిలో
వాస్తవం లేదని, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. సిఆర్డిఏ చట్టం కార్పొరేట్ శక్తులకు అనుకూలం
ఎం. బి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడలో 'రాజధాని నిర్మాణం పాలన కోసమా- ప్రతిష్ట కోసమా' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆంధ్రాలో రాజధానికి పెద్దఎత్తున
భూములు సమీకరించి అన్ని వసతులూ అక్కడే ఏర్పాటు చేస్తారనే ప్రచారం ద్వారా
పెట్టుబడులన్నింటిని పాలకులు ఒకచోట కేంద్రీకరించే పనిచేస్తున్నారని రాఘవులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇదే పద్ధతి అనుసరించడం వల్ల ప్రజల మధ్య అసమానతలు పెరిగి
ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయని చెప్పారు.. ప్రజా రాజధాని అంటే అక్కడున్న
ప్రజలు లాభపడేవిధంగా ఉండాలేగాని, వారిని తరిమేసి మరొకరికి అవకాశం కల్పించే
విధంగా ఉండకూదన్నారు.వనరులను కార్పొరేట్ శక్తులకు బదిలీ చేయడంతోపాటు అభివృద్ధి కేంద్రీకరణ జరిగేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్ష వైఖరి అవలంభిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సిఆర్డిఏ చట్టం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా
ఉందన్నారు. స్థానిక సంస్థల హక్కులూ హరించే విధంగా ఉందని విమర్శించారు.
సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలే ఇళ్లు నిర్మించి ఇస్తాయని,
కొనుగోలు చేసుకోలేకపోతే సాధారణ ఖర్చులతో ఇళ్లను కేటాయిస్తాయని,
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అటువంటి సౌలభ్యం ఉంటుందా అని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ నుండి నిపుణులను తీసుకొచ్చిన చంద్రబాబు మన
దేశంలో, రాష్ట్రంలో ఉన్న నిపుణులతోనూ మరోప్లాను రూపొందించి రెండింటిలో ఏదీ
దేశ, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటే దాన్ని అమలు చేయవచ్చని
సూచించారు. Saturday, 27 December 2014
పాలకులా? మత ప్రచారకులా?
Friday, 26 December 2014
బలిపీఠం పై భీమా రంగం..
దేశంలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న బీమా రంగంలో విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 26 శాతం
నుంచి 49 శాతానికి పెంచేందుకు వీలు కల్పించే చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ
రంగానికి చెందిన యావత్ సిబ్బందే గాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
వ్యక్తమవుతోంది.మతోన్మాద ఎజెండాను తెరపైకి తెచ్చి పార్లమెంటు శీతాకాల
సమావేశాలు సజావుగా
సాగకుండా చేసింది. ఇప్పుడు దానిని సాకుగా చూపి అప్రజా స్వామిక పద్ధతుల్లో
ఆర్డినెన్స్ తేవడం బిజెపి ప్రభుత్వ తెంపరితనాన్ని తెలియజేస్తోంది. ఏదైనా
బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్నప్పుడు అది పార్లమెంటు ఆస్తి కిందకే
వస్తుంది. అటువంటి బిల్లుపై అడ్డగోలుగా ఆర్డినెన్స్ తేవడం పార్లమెంటరీ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి,
దేశంలోని బడా కార్పొరేట్ సంస్థల లాభాల దాహార్తిని తీర్చడమే ఈ
ప్రభుత్వానికి ముఖ్యమైపోయింది.
Thursday, 25 December 2014
రైతుల జీవితాలతో రాక్షస క్రీడలు..మారని బాబు సర్కార్ తీరు !
Wednesday, 17 December 2014
వేల కోట్ల నష్టం..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం
Tuesday, 16 December 2014
ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయ పరచడంలో మోడీ విఫలం:
ఇటీవల ఓ
మంత్రితో పాటు పలువురు బిజెపి ఎంపిలు మత విద్వేషాలు రెచ్చగొట్టే
వ్యాఖ్యానాలను చేయటం, వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు
పార్లమెంట్ సభలను ముందుకు సాగకుండా స్థభింపచేయటం తెలిసిందే. ప్రస్తుతం
మతమార్పిడుల వ్యవహారం ఇంకా పార్లమెంటులో రాజుకుంటూనే ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వం,పార్టీ ఇరుకున పడుతున్నా మోడీ ఏమీ చేయలేని పరిస్తితి నెలకొంది.టి.డి.పి ప్రభుత్వం ఫై రైతుల్లో తొలగుతోన్న బ్రమలు
వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తించకుంటే రైతు సాధికారత సభలు ఎందుకంటూ రైతులు
ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పెసర్లంక, కోనేటిపురం, గొరికపూడిలో
సదస్సులు నిర్వహించారు. పెసర్లంక సదస్సులో రైతులు రుణమాఫీ పై అధికారులను
నిలదీశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వాణిజ్య పంటలకు ఓ పక్క
మద్దతు ధర లేక నష్టాలు చవిచూస్తుంటే రుణమాఫీ పేరుతో ప్రభుత్వం వాణిజ్య పంట
రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ అవుతుందనే ఉద్దేశంతో తాము
ఓట్లు వేశామని, తీరా గెలిచాక వరి పంటకే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడం
ఏమిటని ప్రశ్నించారు. వాణిజ్య పంటలకూ రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు
చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతులు అర్జీలిచ్చేందుకు వేచి చూడాల్సి వచ్చింది. తహశీల్దార్ అంకారావు
మాట్లాడుతూ రుణమాఫీ కానివారు ఈసేవాను సంప్రదించాలని సూచించారు. జన్మభూమి
కమిటీవారికి అర్జీలివ్వాలని ప్రభుత్వం ప్రకటించింది కదా అని పలువురు
మండిపడ్డారు. రోజుకో ప్రకటనతో తమకు అయోమయంగా ఉందని నిట్టూర్చారు.Sunday, 14 December 2014
మళ్లీ తెరపైకి మోడీ ప్రభుత్వ మతతత్వ అజెండా..
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల రూపంలో మతతత్వ అజెండాను ఉధృతం చేస్తోంది . లవ్ జిహాద్, సాధ్వి వ్యాఖ్యలు,
చరిత్ర పుస్తకాల్లో మార్పులు, భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా
ప్రకటించాలనడం, బలవంతపు మత మార్పిడులు, గాంధీని చంపిన గాడ్సేను పొగడడం
ఇలా రకరకాల రూపాల్లో ఆరెస్సెస్, బిజెపిలు తమ ఫాసిస్టు అజెండాను ముందుకు
తెస్తూన్నాయి.. ముస్లింలు, క్రైస్తవుల్లో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో మతానికి
ఒక్కో రేటు నిర్ణయిస్తూ దానిని పక్కాగా అమలు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్లో ముస్లింలతోబాటు క్త్రెస్తవులపై ఒత్తిడి
తెచ్చి బలవంతంగా మత మార్పిడి గావించడానికి సంఫ్‌ు శక్తులు వేసిన పథకం
ఆధారాలతో సహా మీడియాకు లభ్యమైంది. గతంలో హిందువులు ఎక్కడైనా స్వచ్ఛందంగా
ఇతర మతాల్లోకి మారితే వాటిని బలవంతపు మత మార్పిడులంటూ నానా యాగీ చేసిన
ఆరెస్సెస్, బిజెపిలు ఇప్పుడు తామే ఆ పనికి తెగబడడం వాటి ద్వంద్వ వైఖరిని
తెలియజేస్తోంది.
ఊరు పేరు లేని 'బాబు' రైతు రుణ విముక్తి పత్రమ్..
'రైతు రుణ విముక్తి పత్రం' అధికార పార్టీ కరపత్రంలా ఉంది.
రైతు సాధికారిక సంస్థ పేరుతో ఇస్తున్న పత్రాల్లో ఆ సంస్థ ముద్ర (సీలు)గానీ, అధికారి పేరుగానీ లేదు. అసలు రైతుకు సంబం ధించి ఏ బ్యాంకు ఖాతాలో ఎంత బాకీ ఉన్నదీ, ఏ ఖాతాలో ఎంత రుణం మాఫీ అయింది అనే వివరాలూ లేవు. పైగా ఆ పత్రం రాజకీయ విమర్శలు, బ్యాంకులపై ఆరోప ణలతో కూడుకుని ఎవరైనా తప్పుబట్టేందుకు అవకాశం కల్పించేలావుంది.ఎన్నికల్లో వేసే ప్రచార కరప్రతంలా ఉన్న ఈ పత్రాలకు బ్యాంకులు ఏ విధంగా విలువనిస్తాయో ప్రభుత్వానికే తెలియాలి. ఈ పత్రాలను పంపిణీ చేస్తున్న ఎంపిడిఓలు, ఎంఆర్వోలే పెదవి విరుస్తున్నారు. బ్యాంకుల్లో ఏమాత్రం విలువలేని పత్రాలను పంపిణీ చేసి, అవి బ్యాంకుల్లో ఉపయోగపడతాయని చెప్పడం అధికారులుగా మాకు ఇబ్బందికరంగా ఉందంటున్నారు రుణ పత్రమా.. కరపత్రమా

ఎ.పి లో అధికార,ప్రతిపక్షానికి తేడా లేదు..సింగపూర్ మీడియా
ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభు త్వాల మధ్య కుదిరిన రాజధాని ఒప్పందం సింగపూర్ లోనూ చర్చనీయాంశమైంది.
'ది స్ట్రైట్స్ టైమ్స్' అనే పత్రిక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా సింగపూర్ ప్రభుత్వం కుదుర్చు కున్న ఒప్పందానికి ఢోకా ఉండదని ఈ పత్రిక పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయా లను ఈ పత్రిక పోల్చింది. తమిళనాడులో అధికార ఎఐడిఎంకే, ప్రతిపక్ష డిఎంకేల మధ్య కక్ష్యసాధింపు రాజకీయాలు ఉన్నాయని, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది..'బాబు ఓడినా ఢోకాలేదు
Wednesday, 10 December 2014
సి.పి.ఎం (మాగ్జిన్స్)
Here u can know about CPM's familiar magazines like Marxist,Karmikalokam etc..
ఆరునెలల అడియాసలు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయనపై ఎన్నో
ఆశలు! విభజన నేపధ్యంలో చుట్టుముట్టిన సమస్యల వలయం నుండి రాష్ట్రాన్ని
బయటపడే స్తారని ప్రజానీకం ఆశించారు. . ఉధృతంగా సాగిన ఈ ప్రచారంతో
ప్రజానీకం టిడిపికి పట్టం కట్టారు.
ప్రజానీకం పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కారు ప్రయాణం చేస్తున్న తీరు క్లుప్తంగా :
రుణమాఫీ
ఎన్నికల ప్రచారంలో వ్యవసాయరుణా లన్నింటిని మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత, డ్వాక్రా రుణాలనూ రద్దు చేస్తామని ప్రకటించారు. . ప్రమాణస్వీ కారం నాడు మాఫీ ఫైలుకు బదులుగా విధివిధానాల కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై బాబు సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయ రుణాలు కాస్తా పంటరుణాలుగా మారాయి. కుటుంబానికి 1.50 లక్షల రూపాయలకే పరిమితి విధించారు. ఆధార్, రేషన్, ఓటర్‌కార్డులంటూ ఆంక్షలు పెట్టి లబ్ధిదారుల జాబితాను సగానికి తగ్గించివేసింది. నాలుగురోజుల క్రితం చేసిన విధాన ప్రకటనలో కుటుంబానికి 50 వేల రూపాయలు రుణం ఉన్న వారికే తక్షణం మాఫీ వర్తిస్తుందని చెప్పారు. లబ్ధిదారుల జాబితాను జన్మభూమి సభల్లో ఖరారు చేయాల్సిఉంది. ఆ ప్రక్రియ ముగిసి, బ్యాంకర్లకు నగదు చేరితేకాని ఎందరికి లబ్ధి చేకూరిందన్న విషయంపై స్పష్టత రాదు. ఇక డ్వాక్రా, చేనేత రుణ మాఫీల గురించి మాట్లాడటానికి కూడా ప్రభుత్వం సిద్దపడటం లేదు.
రాజధాని
సింగపూర్ తరహాలో ప్రపంచస్థాయి రాజధానిని తీర్చిదిద్దుతామని, ప్రజా రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు పదేపదే చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తరువాత క్రిడా (కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ-సిఆర్డిఎ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో రాజధానికి భూముల కోసం సమీకరణ విధానాన్ని ముందుకు తెచ్చిన ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను తుంగలో తొక్కే దిశలో పయణిస్తోంది. .ఈ ప్రక్రియలో స్థానికుల నుండి వస్తున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తోంది. వ్యవసాయకార్మికలు,కౌలురైతులు, ఇతర వృత్తుల వారి ఊసును విస్మరిస్తూ కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తోంది.రాజధాని నిధుల విషయంలోనూ ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఫించన్ల కోత
అధికారంలోకి వచ్చిన 100రోజుల తరువాత ఫించన్ల పెంపు ప్రకటనను ప్రభుత్వం చేసింది. అదే సమయంలో పలు ఆం క్షలను, విధించింది. వృధ్దాప్య ఫించన్‌ను కుటుంబానికి ఒకరికే పరిమితం చేసింది. అనర్హుల పేరుతో పెద్దఎత్తున కోత పెట్టింది. ఫించను రాదని తెలుసుకున్న కొందరు వృధ్ధులు జన్మభూమి సభల్లోనే ప్రాణాలు విడిచారు.
ప్రత్యేకహోదా ...
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైనప్పటికీ ఆరునెలలు గడిచినా ఆ దిశలో సానుకూల నిర్ణయం వెలువడలేదు.. ప్రత్యేకహోదాతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజిలు, నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది.
అన్న క్యాంటిన్లు ... సుజల స్రవంతి
పేదవాడికి తక్కువ ధరకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రకటించిన అన్నక్యాంటిన్లు ఎప్పుడు ఏర్పాటవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. నివేదికలు సిద్దమయ్యాయి కానీ, అమ లుకు తెచ్చే విషయంలో సర్కారు సాచివేత ధోరణి తో వ్యవహరిస్తోంది. ప్రమాణస్వీకారం నాడే సంత కం చేసిన ఎన్టిఆర్ సుజల స్రవంతిదీ ఇదే బాట.
'బెల్టు' తీసి షాపులు పెట్టారు
ప్రమాణస్వీకార సభలో బెల్టుషాపులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఫైలుపై సంతకం కూడా చేశారు. ఆచరణలో వాటి స్థానంలో అధికారికంగా మద్యం షాపులకు అనుమతిచ్చారు. మద్యం షాపులను విపరీతంగా పెంచారు. మండల, గ్రామ స్థాయిలో కూడా జనాభా సంఖ్యను బట్టి షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిరుద్యోగులకు నిరాశే!
ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆచరణలో ఉన్న ఉపాధిని ఊడగొట్టే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. అంగన్వాడీలు, మధ్యాహ్నాభోజన కార్మికుల ఉపాధి ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితి నెలకొంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

Monday, 8 December 2014
ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు మరచిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం..
2008లో పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సంక్షోభంపర్యవసానంగా ఐస్లాండ్ భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చాలా మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.సింగపూర్ జరుగుతున్న ఆర్థికాభివృద్ధి ఐస్‌లాండ్‌తో సారూప్యం కలిగిఉండటమే కాకుండా దీని ముగింపు కూడా ఐస్లాండ్ తరహాలోనే ఉండే అవకాశం కనపడుతున్నది.సింగపూర్ జపం పర్యవసానాలేమిటో?
మోడీ హయంలో ప్రణాళికాసంఘం ఉనికి ప్రస్నార్ధకం ..
ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అనే రంధిలో పడిపోయి ప్రధాని నరేంద్ర మోడీ
ప్రణాళిక అవసరాన్నే మరచిపోయి, ప్రణాళికాసంఘం ఉనికినే ప్రశ్నిస్తున్నారు.
ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తున్నట్టు నాలుగు నెలల క్రితం ఏకపక్షంగా,
ఏమాత్రం ముందస్తు ఆలోచన లేకుండా ప్రకటించారు.అసలు ప్రణాళికాబద్ధమైన ఆలోచనలకు, చర్యలకు ఆయన వ్యతిరేకి అనడానికి ఇదే
సాక్ష్యం. జాతీయ వనరులను ప్రైవేటుకు కట్టబెట్టే తొందరే ప్రణాళికా సంఘంపై
ఆయన కత్తికట్టడం వెనుక అసలు రహస్యం. అదానీ గ్రూపుతో తన ఆత్మీయబంధంపై
విమర్శలు వెల్లువెత్తు తున్నా, ఆ గ్రూపునకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
నుంచి వేల కోట్ల రూపాయల రుణసాయానికి ప్రతిపాదన రావడం ఆయన ఎంత 'తొందరలో'
ఉన్నారో చెప్పకనే చెప్పింది. 'ప్రభుత్వం వెలుపల, అంటే ప్రైవేట్ రంగంలో
జరుగుతున్న వాటితో సహా దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాలను ఒకే ఛత్రం
కిందికి తెచ్చే విధంగా ఒక సరికొత్త ప్రణాళికా యంత్రాంగాన్ని మనం అభివృద్ధి
చేయగలమా?' అని ప్రశ్నించడంలోనే ఆయన ఆంతర్యం సుస్పష్టం.అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం.అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం.
Sunday, 7 December 2014
సెజ్‌ల ముసుగులో...
పెట్టుబడిదారుల నైజం మారవు గాక మారవు. ఇది చరిత్ర చెప్పిన
సత్యం. ఉత్పత్తి జరుగుతుందని, ఉద్యోగాలొస్తాయని కంపెనీలకు వేల ఎకరాల భూములు
అప్పనంగా అప్పజెపితే ... అసలు కంపెనీలే పెట్టకుండా ఆ భూముల్ని
తెగనమ్ముకుని లాభాలు జేబులో వేసుకుంటున్నారని 'కాగ్' తాజా నివేదికలో
తెలిపింది. ఈ విధానంలో పరిశ్రమలు కాదు, భూమి కీలకమైన, ఆకర్షణీయమైన
వస్తువుగా మారిపోయింది. సెజ్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించిన 45,636
ఎకరాల నోటిఫైడ్ భూమిలో కేవలం 28,488 ఎకరాల్లో మాత్రమే కార్యకలాపాలు
ప్రారంభమయ్యాయి. మిగతా భూమి గడువు పేరుతో డి-నోటిఫై చేసి తమ వాణిజ్య
ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనీ, పచ్చటి పొలాల్లో చిచ్చు పెట్టారనీ
కాగ్ నివేదికలో మొట్టికాయవేసింది. గత పదేళ్ళుగా ఇదే తంతు సాగుతోంది.
ఎడాపెడా రాయితీలు గుప్పించడం వల్ల ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)లోకి
పెట్టుబడులు వెల్లువెత్తి ఉపాధి కల్పన ఇంతలంతలవుతుందని గత మన్మోహన్
సర్కారు ఊదరగొట్టింది. 2005లో ప్రత్యేక చట్టాన్నీ వండి వార్చింది.for more..seeSaturday, 6 December 2014
Friday, 5 December 2014
Subscribe to:
Comments (Atom)